క్యూఆర్‌ కోడ్‌తో విద్యుత్తు బిల్లు

ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్‌) బిల్లు చెల్లింపులో కొత్తగా క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఇళ్లలో మీటర్ల నుంచి రీడింగ్‌ తీశాక వచ్చే బిల్లు కిందే క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి ఉంటుంది.

Published : 05 Jul 2024 03:17 IST

ఈనాడు, వరంగల్‌: ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్‌) బిల్లు చెల్లింపులో కొత్తగా క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఇళ్లలో మీటర్ల నుంచి రీడింగ్‌ తీశాక వచ్చే బిల్లు కిందే క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి ఉంటుంది. వినియోగదారులు తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారా దీన్ని స్కాన్‌ చేసి డెబిట్, క్రెడిట్‌ కార్డులు, యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌ తదితర విధానాల్లో బిల్లును చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఎన్పీడీసీఎల్‌ తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా కొన్ని విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాల(ఈఆర్‌వో) పరిధిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. దశలవారీగా డిస్కం పరిధిలోని అన్ని జిల్లాల్లో క్యూఆర్‌ కోడ్‌ బిల్లులు రానున్నాయని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని