గురుకులాల్లో ఉమ్మడి టైంటేబుల్‌ను తొలగించాలి

సంక్షేమ గురుకులాల్లో ఉమ్మడి టైంటేబుల్‌ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ ఎస్సీ గురుకుల టీచర్లు,

Published : 05 Jul 2024 03:13 IST

టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: సంక్షేమ గురుకులాల్లో ఉమ్మడి టైంటేబుల్‌ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ ఎస్సీ గురుకుల టీచర్లు, ఉద్యోగుల సంఘం (టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ) హెచ్చరించింది. ఉపాధ్యాయుల అభిప్రాయాలు తెలుసుకోకుండా పాఠశాల విద్యాశాఖ ఏకపక్షంగా టైంటేబుల్‌ విడుదల చేసిందని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ బాలరాజు, ఎన్‌.దయాకర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురుకులాలు ఎక్కువగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, పాత గురుకులాల్లో క్వార్టర్లు శిథిలావస్థలో ఉన్నాయని వివరించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సరైన వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని