తమిళనాడులో ముగిసిన తెలంగాణ అధికారుల అధ్యయనం

తమిళనాడులోని రవాణా విధానాలపై తెలంగాణ అధికారుల రెండు రోజుల అధ్యయనం మంగళవారం ముగిసింది. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా అధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్,

Published : 03 Jul 2024 04:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: తమిళనాడులోని రవాణా విధానాలపై తెలంగాణ అధికారుల రెండు రోజుల అధ్యయనం మంగళవారం ముగిసింది. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా అధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ఉప్పల్‌ ఆర్‌టీవో ఎన్‌.వాణి, కామారెడ్డి ఎంవీఐ జింగ్లి శ్రీనివాస్‌లు సోమవారం తొలిరోజు చెన్నైలోని తమిళనాడు రవాణా శాఖ కమిషనరేట్‌ ఉన్నతాధికారులతో భేటీ కాగా మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. మీనంబాకం ఆర్‌టీవో కార్యాలయం, బసంత్‌నగర్‌ ఫిట్‌నెస్‌ సెంటర్, నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌లను సందర్శించి వాహన్, సారథి పోర్టల్‌ ద్వారా వాహనదారులకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. తమిళనాడు జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ సురేశ్, ఆర్టీవోలు సంపత్, శ్రీధర్, ఎంవీఐలు కావేరి, కార్తీక్‌లతో పాటు స్థానిక వినియోగదారుల అనుభవాలను తెలుసుకున్నారు. తమిళనాడు రవాణా విధానాలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌లకు రెండు రోజుల్లో తమ నివేదిక ఇస్తామని చంద్రశేఖర్‌గౌడ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని