గవర్నర్‌తో శాసన సభాపతి, మండలి ఛైర్మన్, సీఎస్‌ భేటీ

రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను రాజ్‌భవన్‌లో మంగళవారం శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 03 Jul 2024 03:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను రాజ్‌భవన్‌లో మంగళవారం శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి.. శాలువా కప్పి సత్కరించారు. రానున్న బడ్జెట్‌ సమావేశాలు సహా పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో శాసనసభ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్‌ నరసింహాచార్యులు, గవర్నర్‌ కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి కూడా రాజ్‌భవన్‌లో ఇన్‌ఛార్జి గవర్నర్‌ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్క అందజేసి.. శాలువా కప్పి సత్కరించారు. గవర్నర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిసిన మరుసటి రోజే అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎస్‌ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 6న తెలంగాణ సీఎం రేవంత్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్న నేపథ్యంలో.. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విషయాలు, ఆస్తుల విభజన తదితర అంశాలపై గవర్నర్‌కు సీఎస్‌ వివరించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని