మందుల కొరత ఉండొద్దు

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశించారు.

Published : 03 Jul 2024 03:19 IST

మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులకు సంబంధించిన ఔషధాలతోపాటు అత్యవసర మందులూ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో తెలంగాణ వైద్య సేవల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీజీఎంఎస్‌ఐడీసీ) ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సదుపాయాలు భౌగోళికంగా ఎక్కడెక్కడ ఉన్నాయి..? అత్యవసర వైద్య సేవలకు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి మ్యాపింగ్‌ చేసి ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్‌ సహదేవరావు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ విశాలాక్షి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కౌటిల్య, చీఫ్‌ ఇంజినీర్‌ దేవేందర్‌కుమార్‌ పాల్గొన్నారు. 

ఆర్‌ఎంపీలపై దాడులు అరికట్టాలి: ఉమ్మడి వేదిక

రాష్ట్రంలో ఆర్‌ఎంపీ, పీఎంపీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని తెలంగాణ ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక కోరింది. వేదిక ప్రతినిధులు మంగళవారం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో మంత్రిని కలసి వినతిపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని