రైతు ఆత్మహత్యపై సమగ్ర విచారణ.. సీఎం రేవంత్, మంత్రి తుమ్మల ఆదేశాలు

ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్‌ ఆత్మహత్య ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,

Published : 03 Jul 2024 03:09 IST

ఈనాడు, హైదరాబాద్‌- చింతకాని, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్‌ ఆత్మహత్య ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. రైతులు పొలం పంచాయితీలతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని, కాంగ్రెస్‌ పాలనలో అందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా రైతు ప్రభాకర్‌ అంత్యక్రియలు ఆయన సొంత గ్రామంలో పోలీసు బందోబస్తు మధ్య జరిగాయి. ఈ ఘటనపై మృతుని తండ్రి వీరభద్రయ్య ఫిర్యాదు మేరకు పది మందిపై ఖమ్మం ఖానాపురం హవేలి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాశ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని