టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో సమస్యలపై పోర్టల్‌

రాష్ట్రంలో తాజాగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అనంతరం ఏమైనా ఫిర్యాదులుంటే పరిష్కరించేందుకు త్వరలో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.

Published : 03 Jul 2024 02:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తాజాగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అనంతరం ఏమైనా ఫిర్యాదులుంటే పరిష్కరించేందుకు త్వరలో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. బదిలీలు, పదోన్నతుల్లో సమస్యలతోపాటు అనారోగ్య సంబంధిత ఏ ఇతర కారణాలనైనా ఈ పోర్టల్‌లో నమోదు చేసుకుని పరిష్కరించుకోవచ్చని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరిగే డీఎస్సీ ద్వారా నియమితులయ్యే కొత్త టీచర్లు ఆగస్టులోనే వస్తారని చెప్పారు. పరీక్ష అనంతరం ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, ఫలితాలు వెల్లడి ఉంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని