నాకు దక్కాల్సిన స్థలం.. బంధువులు పట్టా చేసుకున్నారు!

తనకు దక్కాల్సిన ఆస్తిని బంధువులు అక్రమంగా తీసుకున్నారని ఆరోపిస్తూ.. తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ కరీంనగర్‌లో ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడు సోమవారం నిరసనకు దిగారు.

Published : 02 Jul 2024 05:23 IST

 కరీంనగర్‌లో ప్రజావాణి వద్ద వృద్ధుడి నిరసన

వృద్ధుడిని బయటకు తీసుకెళుతున్నసెక్యూరిటీ సిబ్బంది

కరీంనగర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: తనకు దక్కాల్సిన ఆస్తిని బంధువులు అక్రమంగా తీసుకున్నారని ఆరోపిస్తూ.. తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ కరీంనగర్‌లో ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడు సోమవారం నిరసనకు దిగారు. ఈ మేరకు హుజూరాబాద్‌ మండలం రాంపురానికి చెందిన కన్నం వెంకటయ్య.. అదే గ్రామంలో తన తల్లి పేరిట ఇల్లు, ఇంటి స్థలం పట్టా ఉండేదని, సొంత బంధువులు తనకు తెలియకుండానే పట్టా మార్పిడి చేసుకున్నారని ఆరోపించారు. చాలాసార్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్నా అధికారులు కనికరించడం లేదని వాపోయారు. ప్రజావాణికి వచ్చిన వెంకటయ్య ఈ విషయమై అధికారులతో వాగ్వాదానికి దిగగా.. పోలీసులు వెళ్లమని సూచించారు. అతను అక్కడే కూర్చొని నిరసనకు దిగారు. సెక్యూరిటీ సిబ్బంది వెంకటయ్యను ప్రజావాణి గది బయటకు బలవంతంగా తీసుకెళ్లారు. ప్రజావాణి పూర్తయ్యేవరకు మూడు గంటల పాటు వృద్ధుడు నేలపై పడుకొని నిరసన తెలిపారు. అనంతరం తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయంపై ‘న్యూస్‌టుడే’ కరీంనగర్‌ ఆర్డీవోను సంప్రదించగా వెంకటయ్య పేరు మీద ఎలాంటి టైటిల్‌ లేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని