తమిళనాడుకు తెలంగాణ అధికారుల బృందం

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు తమిళనాడులో రవాణా విధివిధానాలపై అధ్యయనం చేయడానికి రంగారెడ్డి జిల్లా ఉప రవాణాధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఉప్పల్‌ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎంవీఐ శ్రీనివాస్‌తో కూడిన అధికారుల బృందం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లింది.

Published : 02 Jul 2024 05:24 IST

రవాణాశాఖ విధానాలపై అధ్యయనం

తమిళనాడు రవాణా శాఖ అధికారులతో రాష్ట్ర రవాణాశాఖ డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్, అధికారుల బృందం

శంషాబాద్, న్యూస్‌టుడే: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు తమిళనాడులో రవాణా విధివిధానాలపై అధ్యయనం చేయడానికి రంగారెడ్డి జిల్లా ఉప రవాణాధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఉప్పల్‌ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎంవీఐ శ్రీనివాస్‌తో కూడిన అధికారుల బృందం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లింది. సోమవారం ఉదయం చెన్నైలో తమిళనాడు రవాణాశాఖ కమిషనర్‌ షణ్ముగ సుందరం, జాయింట్‌ కమిషనర్‌ సురేశ్, ఆర్టీవో సంపత్‌కుమార్, ఎంవీఐ కార్తిక్‌లతో భేటీ అయింది. ఆటోమేటెడ్‌ టెస్టింగ్, వాహన్‌ పోర్టల్, స్క్రాపింగ్, పన్ను వసూళ్ల విధానాలు, ఆదాయ వివరాల నమోదు, చెక్‌పోస్టుల పనితీరు, ఆన్‌లైన్‌ సేవల సమాచారం తీసుకున్నారు. తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో భాగంగా సేకరించిన అంశాల నివేదికను మంత్రి పొన్నం ప్రభాకర్, కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాష్‌లకు అందజేయనున్నట్లు చంద్రశేఖర్‌గౌడ్‌ తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని