ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ గందరగోళానికి తెర!

ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్‌ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్‌-యూజీ కౌన్సెలింగ్‌ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.

Published : 02 Jul 2024 07:16 IST

రెండు రోజుల్లో తేదీలపై స్పష్టత

ఈనాడు, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్‌ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్‌-యూజీ కౌన్సెలింగ్‌ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఎన్‌ఎంసీ ఒకటి, రెండు రోజుల్లో కౌన్సెలింగ్‌ తేదీలపై స్పష్టత ఇస్తుందని పేర్కొంటున్నాయి. కొందరికి నీట్‌-యూజీ పరీక్ష మళ్లీ నిర్వహించడం, ఫలితాలు వెల్లడించడంతోపాటు అందరికీ కొత్త ర్యాంకులను ఇచ్చిన అంశాన్ని ఎన్టీఏ సుప్రీంకోర్టుకు విన్నవించనుంది. సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉండనుంది. ఆలిండియా కోటా సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో నీట్‌-యూజీ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారు అయితే తప్ప రాష్ట్రాల్లో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ కుదరదు. కాళోజీ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర విద్యార్థుల ర్యాంకుల వివరాలు అందాల్సి ఉంది. అవి అందడానికి పది రోజుల సమయం పడుతుందని.. ఆ తర్వాతే కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారవుతాయని కాళోజీ వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని