7 నుంచి నేతన్న పోరుయాత్ర

రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలంటూ ‘మగ్గం నడవాలి-నేతన్న బతకాలి’ నినాదంతో ఈ నెల 7వ తేదీ నుంచి నేతన్న పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ అనుబంధ చేనేత, మరమగ్గాల కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.

Published : 02 Jul 2024 05:19 IST

తెలంగాణ చేనేత, మరమగ్గాల కార్మిక సంఘాలు  

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలంటూ ‘మగ్గం నడవాలి-నేతన్న బతకాలి’ నినాదంతో ఈ నెల 7వ తేదీ నుంచి నేతన్న పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ అనుబంధ చేనేత, మరమగ్గాల కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని చేనేత, మరమగ్గాల కేంద్రాల మీదుగా కొనసాగే ఈ యాత్ర సిరిసిల్లలో ప్రారంభమవుతుందని, ఈ నెల 15న హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద ‘చలో హైదరాబాద్‌’ పేరిట ‘నేతన్న గర్జన’ నిర్వహిస్తున్నామని వివరించారు. సోమవారం హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్, మరమగ్గాల కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్‌లు విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం నేత, చేనేత కార్మికుల కోసం అమలుచేసిన పథకాలు కాంగ్రెస్‌ సర్కారు వచ్చాక ఆగిపోయాయన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని