నిమ్స్‌కు రూ.2.1 కోట్ల విరాళం

పీడియాట్రిక్‌ ఎపిలెప్సీ సెంటర్‌ స్థాపనతో పాటు వివిధ వసతుల కోసం నిమ్స్‌కు ‘ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌’ సంస్థ రూ.2.1 కోట్ల విరాళం అందజేసింది.

Published : 02 Jul 2024 04:31 IST

నిమ్స్‌ డైరెక్టర్‌ డా.ఎన్‌.బీరప్పకు చెక్కును అందజేస్తున్న రోటరీ క్లబ్‌ ఆఫ్‌ లేక్‌
డిస్ట్రిక్ట్‌ మొయినాబాద్‌ అధ్యక్షుడు చిరంజీవ్‌ సలుజా, ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌
ఛైర్మన్‌ సురేందర్‌పాల్‌ సింగ్‌. చిత్రంలో రోటరీక్లబ్‌ ప్రతినిధులు, నిమ్స్‌ వైద్యాధికారులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: పీడియాట్రిక్‌ ఎపిలెప్సీ సెంటర్‌ స్థాపనతో పాటు వివిధ వసతుల కోసం నిమ్స్‌కు ‘ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌’ సంస్థ రూ.2.1 కోట్ల విరాళం అందజేసింది. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ లేక్‌ డిస్ట్రిక్ట్, మొయినాబాద్‌ ఆధ్వర్యంలో ఈ సంస్థ సోమవారం రాయదుర్గంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చెక్కును నిమ్స్‌ డైరెక్టర్‌ డా.ఎన్‌.బీరప్పకు అందించింది. ఈ మేరకు ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్, నిమ్స్, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ లేక్‌ డిస్ట్రిక్ట్‌ మొయినాబాద్, నిమ్స్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని