ములుగు జిల్లాకు ‘సమ్మక్క సారలమ్మ’ పేరు!

ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి.

Published : 02 Jul 2024 04:20 IST

అభ్యంతరాలు, సూచనల  స్వీకరణకు రేపు గ్రామసభలు

ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి - న్యూస్‌టుడే, ములుగు: ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. పేరు మార్పునకు అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి టి.ఎస్‌.దివాకర సోమవారం ప్రకటన విడుదల చేశారు. మంత్రి సీతక్క ప్రతిపాదనల మేరకు పబ్లిక్‌ నోటీసు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో అభిప్రాయాలను గ్రామసభల్లో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో లిఖిత పూర్వకంగా తెలియజేయాలని సూచించారు. వాటిని పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని