రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా తాండూరులో 5.1 సెం.మీటర్లు కురిసింది.

Published : 01 Jul 2024 05:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా తాండూరులో 5.1 సెం.మీటర్లు కురిసింది. నిజామాబాద్‌ జిల్లా పొతంగల్‌లో 4.8, నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్‌ 4.8, బాసర 4.3, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం కల్దుర్కి 3.9, నందిపేట మండలం సీహెచ్‌ కొండూరు 3.7, ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం 3.6, నారాయణపేట జిల్లా నర్వ 3.3, మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండలం శేరివెంకటాపూర్‌లో 3.2 సెం.మీటర్లు నమోదైంది. జోగులాంబ గద్వాల, వనపర్తి, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఖమ్మం, సూర్యాపేట, కుమురం భీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి జిల్లా ములకలపల్లిలో 8.7 సెం.మీటర్లు నమోదైంది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో బలమైన ఈదురుగాలులు, ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని