నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌తో కాంగ్రెస్‌ నేతల చర్చలు విఫలం

నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌ నాయక్‌తో ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

Published : 01 Jul 2024 04:28 IST

బల్మూరి వెంకట్‌ కారును అడ్డుకుంటున్న ఓయూ జేఏసీ ఛైర్మన్‌ సురేశ్‌ యాదవ్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేశ్, ఇతర విద్యార్థి నాయకులు 

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌ నాయక్‌తో ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఎమ్మెల్సీ, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, నాయకులు రియాజ్, మానవతారాయ్‌ తదితరులు మోతీలాల్‌తో చర్చలు జరిపేందుకు రావటంతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు వారికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆసుపత్రి ప్రధాన భవనం లోనికి వెళ్లే ద్వారం వద్ద నిలువరించే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు శాంతపర్చి.. నేతలను లోనికి పంపించారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతామని, దీక్షను విరమించాలని మోతీలాల్‌ను నేతలు కోరారు. ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్షను విరమిస్తానని ఆయన చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి. ఆసుపత్రి బయట పెద్దసంఖ్యలో గుమిగూడిన నిరుద్యోగులు నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంంతో వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని