అశ్వారావుపేట యువ ఎస్సై ఆత్మహత్యాయత్నం

అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను(34) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం ఠాణాకు వెళ్లిన ఆయన సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు.

Published : 01 Jul 2024 03:16 IST

చికిత్స పొందుతున్న శ్రీరాముల శ్రీను

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను(34) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం ఠాణాకు వెళ్లిన ఆయన సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఒక్కరే కారు డ్రైవింగ్‌ చేసుకుంటూ బయటకు వెళ్లారు. మధ్యాహ్నమైనా తిరిగి రాకపోవడంతో సిబ్బంది కాల్‌ చేయగా ఆయన రెండు ఫోన్లూ స్విచ్‌ఆఫ్‌ వచ్చాయి. దీంతో వారు సీఐ జితేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎస్పీకి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి 11.30 గంటలకు ఎస్సై ఆచూకీ తెలిసింది. ఆయన మహబూబాబాద్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు చూసి ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఎస్సై, సిబ్బంది మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది. ఎస్సైపై కొన్ని ఆరోపణలతో పోలీసు ఉన్నతాధికారులకు వారిలో కొందరు ఫిర్యాదు చేశారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని