80ఏళ్ల నాటి దస్త్రాలకు రక్షణేది?

వస్త్రాల్లో కట్టి ఉంచిన ఈ దస్త్రాలు భూ కొలతలశాఖకు సంబంధించినవి. నిజామాబాద్‌ జిల్లా నుంచి కామారెడ్డికి తరలించిన వీటికి రక్షణ లేకుండా పోయింది. సుమారు పది నెలల నుంచి కామారెడ్డి కలెక్టరేట్‌లోని ఓ గదిలో మూలన పెట్టి ఉంచారు.

Published : 30 Jun 2024 05:57 IST

స్త్రాల్లో కట్టి ఉంచిన ఈ దస్త్రాలు భూ కొలతలశాఖకు సంబంధించినవి. నిజామాబాద్‌ జిల్లా నుంచి కామారెడ్డికి తరలించిన వీటికి రక్షణ లేకుండా పోయింది. సుమారు పది నెలల నుంచి కామారెడ్డి కలెక్టరేట్‌లోని ఓ గదిలో మూలన పెట్టి ఉంచారు. దస్త్రాలను ఉంచేందుకు ఫర్నిచర్‌ చేయించే బాధ్యతను రహదారులు, భవనాల శాఖకు అప్పగించారు. దస్త్రాలు భద్రపరచడానికి రూ.8 లక్షలు మంజూరై, టెండర్లు ఆహ్వానించినప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. భూ సమస్యల పరిష్కారానికి కీలకమైన 80ఏళ్లనాటి ఈ దస్త్రాలు వర్షం నీరు లోపలికి వచ్చినా, కార్యాలయంలోకి ఎలుకలు చేరినా పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉండటంతో వెంటనే వీటి రక్షణకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ర.భ శాఖ డీఈ శ్రీనివాస్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ఫర్నిచర్‌ చేయించడానికి డబ్బులు మంజూరైన మాట వాస్తవమేనని, గుత్తేదారు సంస్థ మారడంతో సొంతంగా పెట్టుబడి పెట్టేవారు ముందుకురాక జాప్యం జరిగిందని, త్వరలో పనులు పూర్తిచేయించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. 

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని