కొత్త క్రిమినల్‌ చట్టాలపై ‘సమాహార’ యాప్‌

కొత్త క్రిమినల్‌ చట్టాల వివరాలతో కూడిన హ్యాండ్‌బుక్‌తోపాటు మొబైల్‌ అప్లికేషన్‌ (యాప్‌) ‘సమాహార’ను తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డా.జితేందర్‌ శనివారం ఆవిష్కరించారు.

Published : 30 Jun 2024 04:39 IST

ఆవిష్కరించిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి

కొత్త క్రిమినల్‌ చట్టాల హ్యాండ్‌బుక్‌ను విడుదల చేస్తున్న హోంశాఖ ముఖ్య  కార్యదర్శి డా.జితేందర్‌. చిత్రంలో డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ వైజయంతి

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త క్రిమినల్‌ చట్టాల వివరాలతో కూడిన హ్యాండ్‌బుక్‌తోపాటు మొబైల్‌ అప్లికేషన్‌ (యాప్‌) ‘సమాహార’ను తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డా.జితేందర్‌ శనివారం ఆవిష్కరించారు. జులై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టాల సమగ్ర వివరాలతో ప్రాసిక్యూషన్‌ డిపార్ట్‌మెంట్‌ వీటిని రూపొందించింది. కొత్త, పాత చట్టాల సెక్షన్ల పోలికతో కూడిన పట్టికలు, మార్గదర్శకాలు, ప్రధానమైన మూడు క్రిమినల్‌ చట్టాల గురించిన వివరణలు, అవగాహన కోసం రూపొందించిన లఘుచిత్రాలను వీటిలో పొందుపరిచారు. వీటి రూపకల్పనకు మార్గదర్శకత్వం వహించిన తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ జి.వైజయంతి మాట్లాడుతూ.. ఇతర సంస్థలు రూపొందించిన అప్లికేషన్లతో పోల్చితే ‘సమాహార’.. దర్యాప్తు అధికారులతోపాటు ప్రాసిక్యూటర్లకు అత్యంత ఉపయుక్తంగా ఉంటుందన్నారు. వీటి రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషించిన వైజయంతితోపాటు ఆమె బృందాన్ని డా.జితేందర్‌ అభినందించారు. కొత్త చట్టాల అమలులో వీటి పాత్ర కీలకమని ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు