ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కళాకారుడు సాయిచంద్‌

తన ఆట, పాట, అద్భుతమైన వాగ్ధాటితో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కళాకారుడు సాయిచంద్‌ కుటుంబానికి అండగా నిలుస్తామని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Published : 30 Jun 2024 04:35 IST

ఆయన కుటుంబానికి అండగా నిలుస్తాం: కేటీఆర్‌

సాయిచంద్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు. చిత్రంలో సాయిచంద్‌ కుటుంబసభ్యులు, దేశపతి శ్రీనివాస్‌ తదితరులు  

కర్మన్‌ఘాట్, న్యూస్‌టుడే: తన ఆట, పాట, అద్భుతమైన వాగ్ధాటితో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కళాకారుడు సాయిచంద్‌ కుటుంబానికి అండగా నిలుస్తామని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భారాస నేత, కళాకారుడు సాయిచంద్‌ వర్ధంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని హస్తినాపురంలో ‘సాయిచంద్‌ యాది’ పేరిట సభ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి; సాయిచంద్‌ భార్య రజిని, తండ్రి వెంకట్రాములు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ప్రజాప్రతినిధులు బాల్క సుమన్, రసమయి బాలకృష్ణ, గాదరి కిశోర్, దేవీప్రసాద్, కవులు, కళాకారులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సాయిచంద్‌ మనతో లేకున్నా.. తన పాటలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారన్నారు. బతికి ఉంటే కచ్చితంగా చట్టసభల్లో అడుగు పెట్టేవారని చెప్పారు. సాయిచంద్‌పై రూపొందించిన పాటల సీడీతోపాటు వెలిశాల కొండల్‌రావు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కళాకారులతోపాటు సాయిచంద్‌ తండ్రి వెంకట్రాములు పాడిన పాట కంటతడి పెట్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని