టిస్‌లో 90 మంది సిబ్బంది తొలగింపు!

హైదరాబాద్‌లోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌)లో 90 మంది ఉద్యోగులను శనివారం విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.

Published : 30 Jun 2024 04:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌)లో 90 మంది ఉద్యోగులను శనివారం విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. వీరిలో 50 మంది ప్రొఫెసర్లు, 40 మంది బోధనేతర సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. దీంతో ఇక్కడ కేవలం 19 మంది ప్రొఫెసర్లు మాత్రమే మిగిలారు. కేంద్రం  ఆధ్వర్యంలో నడిచే ఈ వర్సిటీకి యూజీసీ నిధులు విడుదల చేయకపోవటంతో జీతభత్యాలు భరించటం కష్టంగా మారి ఈ చర్య చేపట్టినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని