- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
కృష్ణపట్టి ఏరియాలో పెద్దపులి సంచారం
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్‌తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు.
కంబాలపల్లి రేంజ్ వద్ద ట్రాప్స్ కెమెరాలో చిక్కిన పెద్దపులి
దేవరకొండ, న్యూస్‌టుడే: కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్‌తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. దీంతో పాటు అంతరించిపోతున్న జాతికి చెందిన రాబందు సైతం నల్లమలలో కనపడినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్స్ కెమెరాలో చాలా ఏళ్ల తర్వాత పెద్దపులి కనపడిందని, కంబాలపల్లి రేంజ్ పరిధిలోని కృష్ణపట్టి ఏరియాలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. కర్నూల్ జిల్లా శ్రీశైలం ప్రాంతం నుంచి నల్లమల అటవీ ప్రాంతం వరకు పెద్దపులి సంచరించినట్లు ఆనవాళ్లు గుర్తించారు. కృష్ణాపరీవాహక ప్రాంతం, డిండి నది అడుగంటడంతో పెద్దపులి అనువుగా ఉన్న ప్రదేశం కోసం సంచరిస్తూ దేవరకొండ నియోజకవర్గంలోని నల్లమలకు చేరింది. నిత్యం 40 కిలోమీటర్ల మేర ఈ పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. దీంతోపాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో రాబందు కూడా ప్రత్యక్షమైందని, నల్లమల అడవిలోని కంబాలపల్లి రేంజ్ పరిధిలో శాకాహార జంతువులు, నీళ్లు తదితర సదుపాయాలు పెరగడంతో ఈ రెండు జంతువులు ఇక్కడికి చేరినట్లు నాగార్జునసాగర్ రిజర్వ్ డీఎఫ్‌వో సర్వేశ్వర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం అదే మార్గంలో త్వరలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
వసతుల్లేని వర్సిటీలు!
ఉన్నత చదువులు చదివి.. జీవితంలో ఉత్తమంగా ఎదగాలన్న ఆశలు, ఆశయాలతో విశ్వవిద్యాలయాలకు వస్తున్న విద్యార్థులకు కనీస సదుపాయాల కొరత పరీక్ష పెడుతోంది. -
తెలంగాణ ఏర్పాటులో డీఎస్ పాత్ర కీలకం
పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని.. ఆయన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. -
10 మంది విద్యార్థులు మించితే.. ఇద్దరు టీచర్లు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది విద్యార్థులు దాటిన చోట ఇక ఇద్దరు ఉపాధ్యాయులు రానున్నారు. 41 మంది పిల్లలు మించితే ముగ్గురు టీచర్లు ఉంటారు. -
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరులో 5.1 సెం.మీటర్లు కురిసింది. -
అరుదైన రాజనీతిజ్ఞుడు
భారత మాజీ ఉప రాష్ట్రపతి, రాజనీతిజ్ఞుడు వెంకయ్య నాయుడికి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నా. -
నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌తో కాంగ్రెస్ నేతల చర్చలు విఫలం
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్‌తో ఆదివారం రాత్రి కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. -
సింగరేణి.. మొక్కల గని..!
అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతం సింగరేణి పరిధి రామగుండం ఏరియాలో బొగ్గు తవ్వకం తాలూకు మట్టి కుప్పలు నిండిన ప్రదేశం అంటే నమ్మగలమా. -
పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
దేశం పారిశ్రామికంగా సుస్థిరాభివృద్ధి సాధించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. -
చుక్ చుక్ బండి.. పట్టాల కింది నుంచీ వెళ్తుందండి..!
నగరాలు, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు కడతారు. బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ కూడా బైపాస్ లైన్లు, రైల్ ఓవర్ రైల్(ఆర్ఓఆర్) వంతెనలు నిర్మిస్తోంది. -
న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి
దేశ న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పేదలు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం అడిగే పరిస్థితి ఉందా.. అన్న అంశంపై చర్చ జరగాలన్నారు. -
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ఎంపీ మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. దివంగత నేత ఎన్టీఆర్‌కూ ఆ అవార్డు ఇవ్వాలని అన్నారు. -
విజయవాడ హైవేపై.. ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్ల ప్రారంభం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
ఇదీ సంగతి!
అది ఉద్యోగులకే..మనకు కాదు!! -
1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు ప్రధాన విద్యుత్తు కేంద్రాల్లో ఏకంగా 1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి విఘాతం ఏర్పడింది. -
కోడింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్
కోడింగ్‌లో హైదరాబాద్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్ రాయదుర్గం టీహబ్‌లో ఆదివారం ఎండ్ నౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోషల్‌వుడ్ 2024 సమిట్ (ద్వి వార్షిక సదస్సు) నిర్వహించారు. -
మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలన!
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఎంపీపీలు, జడ్పీ ఛైర్పర్సన్ల పదవీకాలం జులై 3, 4 తేదీల్లో ముగియనుండగా.. వారి స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం చేపట్టనున్నారు. -
రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి లక్ష్యం రూ.18,500 కోట్లు
ఖజానాకు కీలక ఆదాయాన్ని ఆర్జించి పెట్టే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వం రూ.18,500 కోట్ల రాబడిని లక్ష్యంగా నిర్దేశించింది. -
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!
పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకం (ఎంపీ లాడ్స్) వ్యయం ఇకపై ఆన్లైన్ వేదికగా జరగనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ
-
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
-
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం
-
పులకించిన పెద్దపోతులపాడు
-
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
-
ఈ ఊరు.. వైద్యుల పుట్టినిల్లు..!