ఆరోగ్య, ఆహార అలవాట్లపై ‘న్యూట్రిషన్‌ అట్లాస్‌’

దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితులపై తాజా సమగ్ర సమాచారాన్ని ఐసీఎంఆర్‌ - ఎన్‌ఐఎన్‌ (భారతీయ వైద్య పరిశోధన మండలి - జాతీయ పోషకాహార సంస్థ) అందుబాటులోకి తెచ్చింది.

Published : 29 Jun 2024 05:47 IST

రాష్ట్రాలవారీ డేటాను రూపొందించిన ఎన్‌ఐఎన్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితులపై తాజా సమగ్ర సమాచారాన్ని ఐసీఎంఆర్‌ - ఎన్‌ఐఎన్‌ (భారతీయ వైద్య పరిశోధన మండలి - జాతీయ పోషకాహార సంస్థ) అందుబాటులోకి తెచ్చింది. ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాలు, ఆడాల్సిన క్రీడలకు సంబంధించిన సమాచారాన్ని www.nutritionatlasindia.in or www.nurtritionatlasindia.com అనే రెండు వెబ్‌సైట్లలో పొందుపరిచింది. ఇందులో వయసుల వారీగా ప్రజలు తీసుకుంటున్న ఆహారం, వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్త డా.సుబ్బారావు ఎం గవరవరపు నాయకత్వం వహించగా... ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డా.హేమలత కన్వీనర్‌గా వ్యవహరించారు. ఈ అట్లాస్‌ ప్రకారం...  తెలుగు రాష్ట్రాలను రక్తహీనత వేధిస్తోంది. దేశంలో 59.1% మంది కౌమార దశలో ఉన్న అమ్మాయిలు రక్తహీనతతో ఉన్నారు. ఈ విభాగంలో తెలంగాణ 64.70 శాతంతో 27వ స్థానంలో, 60.10% మందితో ఆంధ్రప్రదేశ్‌ 22వ స్థానంలో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని