జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం

ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది.

Published : 29 Jun 2024 05:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. సొసైటీలో ఏకీకృత సిబ్బంది విధానం లేకపోవడంతో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరు సిబ్బందికి సంబంధించి సీనియారిటీ జాబితాలోనూ పొరపాట్లు జరిగాయి. దీంతో సొసైటీలో జీవో నం.317 కింద ఉద్యోగుల కేటాయింపు గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి, అదనపు కార్యదర్శి హన్మంతనాయక్‌లు... గురుకుల సొసైటీ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల వారితో సమావేశమయ్యారు. పదోన్నతులు, జీవో నం.317 కేటాయింపులపై ఇబ్బందులను పరిశీలించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సొసైటీలో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు బదులుగా ఆఫ్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, స్పౌజ్‌ కేసులతో కూడిన సవరణ సీనియారిటీ జాబితాను అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని