రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ నాయకులు జగజీత్‌సింగ్‌ దల్లేవాల్, నల్లమల వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

Published : 29 Jun 2024 04:47 IST

సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండ్‌

దిల్లీలో రైతులపై ప్రయోగించిన తూటాలివేనని చూపుతున్న సుర్జీత్‌సింగ్‌. చిత్రంలో రైతు సంఘాల నాయకులు

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ నాయకులు జగజీత్‌సింగ్‌ దల్లేవాల్, నల్లమల వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. దక్షిణాది రాష్ట్రాల రైతుల మద్దతు కూడగట్టేందుకు చేపట్టిన యాత్ర హైదరాబాద్‌ చేరుకున్న సందర్భంగా శుక్రవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. రైతులకు సంబంధించిన 12 డిమాండ్లపై పార్లమెంటులో రైతుల పక్షాన ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాలని ఇండియా కూటమిలోని అన్ని పార్టీలతో పాటు ఎన్డీయేలోని భాజపాయేతర పార్టీల ఎంపీలనూ కలిసి వినతిపత్రాలు ఇస్తున్నట్లు వివరించారు. కిసాన్‌ మోర్చా సౌత్‌ ఇండియా కన్వీనర్‌ కురుబూరు శాంతకుమార్‌ మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తోందన్నారు. హరియాణా రాష్ట్ర రైతు నాయకుడు అభిమన్యు మాట్లాడారు. దిల్లీలో రైతులపై కాల్పులు జరిగిన తూటాలను రైతు నాయకుడు సుర్జీత్‌సింగ్‌ ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని