మహిళా సూపరింటెండెంట్‌ ఆరోపణలపై నేడు విచారణ

సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి తనను వేధించారంటూ మహిళా సూపరింటెండెంట్‌ డి.జయలక్ష్మి చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టనుంది.

Published : 29 Jun 2024 04:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి తనను వేధించారంటూ మహిళా సూపరింటెండెంట్‌ డి.జయలక్ష్మి చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. సచివాలయంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే విచారణకు హాజరుకావాలని అటవీశాఖ అదనపు కార్యదర్శి జయలక్ష్మిని కోరారు. శాఖాపరమైన అంశాల్లో సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి వేధిస్తున్నారంటూ జయలక్ష్మి కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు తనపై జరిగిన వేధింపుల విషయంపై ఆమె కొత్తగూడెం ఎమ్మెల్యేకు కూడా కొద్దిరోజుల క్రితం వినతిపత్రం ఇవ్వగా.. అది రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. శాఖాపరంగా తనను వేధించారంటూ జయలక్ష్మి గత ప్రభుత్వ హయాంలో మహిళా కమిషన్‌కు, పీసీసీఎఫ్‌కు, అటవీశాఖ మంత్రికి, సీఎంకు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ అంతర్గతంగా ఓ కమిటీ వేయగా ఆరోపణలు రుజువు కాలేదని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. విచారణ పేరుతో అధికారి చేసిన వేధింపుల విషయంలో తనకు న్యాయం జరగలేదని,సదరు సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌పై చర్యలు తీసుకోలేదంటూ జయలక్ష్మి తాజాగా కేంద్ర అటవీశాఖకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని