ఏడుగురు తహసీల్దార్లకు ఎన్నికల తిరుగు బదిలీ

ఈ నెలతోపాటు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న ఏడుగురు తహసీల్దార్లను రెవెన్యూ శాఖ బదిలీ చేసింది.

Published : 29 Jun 2024 04:42 IST

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిన ట్రెసా రాష్ట్ర ప్రతినిధులు

ఈనాడు, హైదరాబాద్‌: ఈ నెలతోపాటు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న ఏడుగురు తహసీల్దార్లను రెవెన్యూ శాఖ బదిలీ చేసింది. శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లను వారు పనిచేస్తున్న జిల్లాల నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో వారిని తిరిగి పాత జిల్లాలకు బదిలీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో పదవీ విరమణ పొందే వారికి సర్వీసుకు సంబంధించిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే బదిలీ చేయాలని ట్రెసా సంఘం ప్రభుత్వాన్ని కోరడంతో భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.   

మిగిలిన బదిలీలు పూర్తి చేయండి: ట్రెసా 

ఎన్నికల తిరుగు బదిలీలు వెంటనే చేపట్టాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతంకుమార్, ఉపాధ్యక్షులు నిరంజన్, బాణాల రాంరెడ్డి శుక్రవారం కోరారు. తిరుగు బదిలీల కోసం తహసీల్దార్లతోపాటు పలు క్యాడర్ల అధికారులు ఎదురుచూస్తున్నారని వివరించారు. సస్పెండ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ ఐఆర్‌ వెంకట్‌రెడ్డి విషయంలో న్యాయం చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని