రామగుండంలో 800 మె.వా. విద్యుత్కేంద్రం

రామగుండంలో పాత 62.5 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్కేంద్రాన్ని తొలగించి అదే ప్రదేశంలో అత్యాధునిక సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో 800 మె.వా. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Updated : 26 Jun 2024 05:53 IST

సింగరేణి ఆధ్వర్యంలో నిర్మిస్తాం: భట్టి

భట్టికి వినతిపత్రం అందజేస్తున్న రాజ్‌ఠాకూర్‌. చిత్రంలో ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, విజయ రమణారావు, ప్రేమ్‌సాగర్‌రావు  

ఈనాడు, హైదరాబాద్‌: రామగుండంలో పాత 62.5 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్కేంద్రాన్ని తొలగించి అదే ప్రదేశంలో అత్యాధునిక సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో 800 మె.వా. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం తనను కలసిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ఎమ్మెల్యేలకు భట్టి ఈ విషయం తెలిపారు. స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు, రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు రామగుండంలో థర్మల్‌ విద్యుత్కేంద్రం నిర్మించాలని వారంతా వినతిపత్రం అందజేయగా డిప్యూటీ సీఎం స్పందించారు.  మంత్రులతోపాటు ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్, విజయరమణారావు, ప్రేమ్‌సాగర్‌ రావు తదితరులు భట్టిని కలిసిన వారిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని