ఆదివాసీ మహిళలపై సాయుధ బలగాల అకృత్యాలు

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఆపరేషన్‌ కగార్‌ పేరిట కేంద్ర బలగాలు ఆదివాసీ మహిళల జీవన హక్కులను కాలరాస్తూ, వారిపై అఘాయిత్యాలకు పాల్పడటం దుర్మార్గమని వక్తలు మండిపడ్డారు.

Published : 26 Jun 2024 05:23 IST

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల మండిపాటు

మాట్లాడుతున్న సజయ

ముషీరాబాద్, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఆపరేషన్‌ కగార్‌ పేరిట కేంద్ర బలగాలు ఆదివాసీ మహిళల జీవన హక్కులను కాలరాస్తూ, వారిపై అఘాయిత్యాలకు పాల్పడటం దుర్మార్గమని వక్తలు మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో.. ఆదివాసీ మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఖండిస్తూ రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. సామాజికకార్యకర్త సజయ మాట్లాడుతూ.. మావోయిస్టులను కట్టడి చేసేందుకు ఆదివాసీ మహిళలను కేంద్ర బలగాలు అనేక రకాలుగా హింసిస్తున్నాయన్నారు. పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ సంధ్య మాట్లాడుతూ హింసకు పాల్పడుతున్న సాయుధ పోలీసు క్యాంపులను తక్షణమే ఎత్తివేయాలన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో చట్టబద్ధంగా పాలన సాగాలని ప్రొఫెసర్‌ వనమాల డిమాండ్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌లో చెంచు మహిళపై దాడి ఘటనపై సిటింగ్‌ జడ్డితో విచారణ జరిపించాలన్నారు. సమావేశానికి సంఘం రాష్ట్ర కన్వీనర్‌ జ్యోతి అధ్యక్షత వహించగా నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌ అధ్యక్షురాలు సృజన, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని