పింఛనుదారులపై చిన్నచూపు తగదు: మందకృష్ణ మాదిగ

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పింఛనుదారులను చిన్నచూపు చూస్తోందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్‌) వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

Published : 26 Jun 2024 05:22 IST

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పింఛనుదారులను చిన్నచూపు చూస్తోందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్‌) వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ‘చేయూత’ లబ్ధిదారుల్లో కొందరికి 25వ తేదీ దాటినా పింఛను అందలేదన్నారు. ఈమేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన వీహెచ్‌పీఎస్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘రేవంత్‌ సీఎంగా ప్రమాణం చేయగానే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పుకొంటున్న సర్కారు, అదే నెల నుంచి పింఛన్లు ఎందుకు పెంచలేదు? ఏపీ సీఎం చంద్రబాబు మ్యానిఫెస్టోలో చెప్పినట్లు ఏప్రిల్‌ నుంచే పెంచిన పింఛను ఇవ్వనున్నారు. తెలంగాణలో నవంబరులోనే హామీ ఇచ్చినందున అప్పట్నుంచే ఇవ్వాలి. దివ్యాంగుల సమస్యలపై జులై 2వ తేదీలోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే 5వ తేదీ నుంచి ఆందోళనలు చేపడతాం. కేసీఆర్‌ మద్దతూ కోరతాం’’ అని పేర్కొన్నారు. సమావేశంలో వీహెచ్‌పీఎస్‌ ప్రతినిధులు అందె రాంబాబు, సుజాత సూర్యవంశీ, సామినేని భవానీచౌదరి, జంగయ్య, మంగమ్మ, గోవర్ధన్, నరేందర్, స్నేహలతారెడ్డి, సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు