పాత పింఛను విధానం అమలు చేయండి

తెలంగాణ ఉద్యోగుల ఐకాస అత్యవసర సమావేశం హైదరాబాద్‌లోని టీఎన్‌జీవో కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగింది.

Published : 26 Jun 2024 05:22 IST

తెలంగాణ ఉద్యోగ ఐకాస అత్యవసర సమావేశంలో 21 డిమాండ్లపై తీర్మానం

సమావేశంలో మాట్లాడుతున్న ఐకాస ఛైర్మన్‌ జగదీశ్వర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల ఐకాస అత్యవసర సమావేశం హైదరాబాద్‌లోని టీఎన్‌జీవో కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగింది. టీజీవో, టీఎన్‌జీవో, రెవెన్యూ, జూనియర్‌ అధ్యాపకులు తదితర 40 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐకాస ఛైర్మన్‌ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను చర్చించి మొత్తం 21 తీర్మానాలను ఆమోదించారు. వాటిపై ప్రభుత్వంతో చర్చించి తదుపరి సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగుల ఆగ్రహాన్ని చూసిందని, గత సర్కారు చేసిన తప్పును ఈ ప్రభుత్వం చేయకుండా సమస్యలను పరిష్కరించాలని నేతలు కోరారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు సత్యనారాయణ, ముజీబ్, లచ్చిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చంద్రశేఖర్, మణిపాల్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్, ప్రవీణ్, గంగాధర్‌  పాల్గొన్నారు.

‘సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలి. 2018 నుంచి బదిలీలు లేనందున వెంటనే జరపాలి. ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టాలి. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నందున కనీసం రెండింటిని విడుదల చేయాలి. పెండింగ్‌ పదోన్నతులను ఇప్పించాలి’ తదితర తీర్మానాలను ఆమోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు