ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడిగా విశ్వనాథ్‌

భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) రాష్ట్ర అధ్యక్షుడిగా కె.విశ్వనాథ్‌(గోదావరిఖని), ప్రధాన కార్యదర్శిగా ఆరెళ్లి కృష్ణ(వరంగల్‌)ను ఎన్నుకున్నారు.

Published : 26 Jun 2024 05:18 IST

ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు విశ్వనాథ్, ఆరెళ్లి కృష్ణ

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) రాష్ట్ర అధ్యక్షుడిగా కె.విశ్వనాథ్‌(గోదావరిఖని), ప్రధాన కార్యదర్శిగా ఆరెళ్లి కృష్ణ(వరంగల్‌)ను ఎన్నుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ ఎన్నిక చేపట్టారు. ఉపాధ్యక్షులుగా పి.వరదయ్య(నిజామాబాద్‌), ఎస్కే మదార్‌ (మహబూబాబాద్‌), సహాయ కార్యదర్శులుగా బి.రాంసింగ్‌ (భద్రాద్రి), అప్పారావు(వరంగల్‌), కోశాధికారిగా డి.లచ్చన్న (పెద్దపల్లి)తో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సమావేశంలో బొగ్గుబావుల వేలంపాటను నిలిపివేయాలని, నూతన భూగర్భ గనుల ఏర్పాటు, చిన్న పరిశ్రమలపై జీఎస్టీని తొలగించాలని తీర్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని