Jagitial Bribe Row: లంచం అడిగిన అధికారికి నోట్ల దండ

జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం లేనిదే ఏ పని చేయడం లేదంటూ జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం మత్స్యకారులు వినూత్న నిరసనకు దిగారు.

Updated : 12 Dec 2023 10:18 IST

జగిత్యాలలో మత్స్యకారుల వినూత్న నిరసన

జగిత్యాల, న్యూస్‌టుడే: జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం (Jagitial Bribe Row) లేనిదే ఏ పని చేయడం లేదంటూ జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం మత్స్యకారులు వినూత్న నిరసనకు దిగారు. జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పల్లికొండ ప్రవీణ్‌ ఆధ్వర్యంలో వివిధ సొసైటీలకు చెందిన మత్స్యకారులు ప్రజావాణిలో కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌బాషాను కలిసి జిల్లా మత్స్యశాఖ అధికారి దామోదర్‌ తీరుపై ఫిర్యాదు చేశారు. మంగెళ నూతన సొసైటీ, రంగాపూర్‌, కల్వకోట గ్రామాలను బీమారం సొసైటీ నుంచి వేరుచేయడం, వెల్గటూరు తదితర సొసైటీలకు సంబంధించిన ఏ పని లంచం ఇవ్వనిదే చేయడం లేదని, సహకార సంఘాల డైరెక్టర్లను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన అధికారి దామోదర్‌ మెడలో నోట్ల దండ వేశారు. అతను తీసి పడేసి తన కార్యాలయానికి వెళ్తుండగా మళ్లీ అధికారి మెడలో దండ వేసి కార్యాలయం గదిలోకి వెళ్లారు. తాను లంచం అడగడం లేదని అధికారి పేర్కొనగా తమ ఫోన్లలో ఉన్న వాయిస్‌ రికార్డును వినిపించారు. తాను ఎవ్వరినీ డబ్బులు అడగలేదని వారి మధ్య గొడవలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని జిల్లా మత్స్యశాఖ అధికారి దామోదర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని