28, 29 తేదీల్లో పాక్షిక చంద్ర గ్రహణం

దేశంలో ఈ ఏడాది కనిపించే ఏకైక చంద్ర గ్రహణం ఈ నెల 28, 29 తేదీల్లో ఏర్పడుతుందని ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్‌ రఘునందన్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 27 Oct 2023 04:54 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: దేశంలో ఈ ఏడాది కనిపించే ఏకైక చంద్ర గ్రహణం ఈ నెల 28, 29 తేదీల్లో ఏర్పడుతుందని ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్‌ రఘునందన్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది పాక్షిక గ్రహణమని.. 28న రాత్రి 11:30 గంటలకు ప్రారంభమై, 29న తెల్లవారుజామున 3:58 నిమిషాలకు ముగుస్తుందన్నారు. అర్ధరాత్రి 1:05 నుంచి 2:23 వరకు మాత్రమే కంటికి కనిపిస్తుందని వివరించారు. దేశంలో కనిపించే తదుపరి చంద్ర గ్రహణం 2025 సెప్టెంబరు 7న సంభవిస్తుందన్నారు. 2024లో రెండు సూర్య, ఒక చంద్ర గ్రహణాలున్నా అవి భారతదేశంలో కనిపించవన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని