దేశంలో తొలిసారిగా ఎంఆర్‌-లినాక్‌ రేడియేషన్‌ యంత్రం అందుబాటులోకి..

క్యాన్సర్‌ చికిత్సలో కీలకమైన ఎంఆర్‌-లినాక్‌ రేడియేషన్‌ టెక్నాలజీ యంత్రాన్ని యశోద ఆసుపత్రి అందుబాటులోకి తీసుకువచ్చింది.

Published : 21 Jun 2023 03:39 IST

యశోద ఆసుపత్రిలో ప్రారంభం
క్యాన్సర్‌ చికిత్సలో కీలకం..

మాదాపూర్‌, న్యూస్‌టుడే: క్యాన్సర్‌ చికిత్సలో కీలకమైన ఎంఆర్‌-లినాక్‌ రేడియేషన్‌ టెక్నాలజీ యంత్రాన్ని యశోద ఆసుపత్రి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యంత్రాన్ని మంగళవారం హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని యశోద ఆసుపత్రిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముంబయిలోని టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ సి.ఎస్‌.ప్రమేష్‌ మాట్లాడుతూ.. అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎంఆర్‌-లినాక్‌ యంత్రాన్ని భారత్‌లో మొదటిసారిగా యశోద ఆసుపత్రి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. యశోద గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.ఎస్‌.రావు మాట్లాడుతూ భారతీయుల్లో రొమ్ము, ఊపిరితిత్తులు, నోటి, గర్భాశయ క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఐసీఎంఆర్‌ అంచనాల ప్రకారం 2020-25 మధ్య క్యాన్సర్‌ వ్యాధి 12.8 శాతం పెరగవచ్చన్నారు. ఈ క్రమంలోనే క్యాన్సర్‌ చికిత్స కోసం ఎలెక్టా కంపెనీకి చెందిన ఎంఆర్‌-లినాక్‌ యంత్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.  ఈ కార్యక్రమంలో బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.సుబ్రమణ్యేశ్వర్‌రావు, ఎలెక్టా కంపెనీ ఇండియా ఎండీ మణికందన్‌బాలా, వైస్‌ప్రెసిడెంట్‌ డాక్టర్‌ బోరా, యశోద ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని