Komatireddy: ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే

తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమే, అలాగని కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే ఎలాగంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated : 04 Jul 2024 10:21 IST

ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీ

సచివాలయంలోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

ఈనాడు, హైదారాబాద్‌: తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమే, అలాగని కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే ఎలాగంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. సచివాలయంలోని తన మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ విభాగాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్దేశిత సమయానికి 50% సిబ్బంది మాత్రమే విధులకు హాజరైనట్లు గుర్తించి అసహనం వ్యక్తంచేశారు. అందరూ పనివేళలు పాటించాల్సిందేనని స్పష్టంచేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ ‘‘ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి గంపెడాశలతో దూరప్రాంతాల నుంచి వస్తారు. వారికి గత పదేళ్లుగా మంత్రులను, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం రాలేదు. ఇప్పుడు వారి కష్టాలు తీరాలంటే మనం అందుబాటులో ఉండాలి. ప్రజలు మాకే వినతిపత్రాలను సమర్పిస్తున్నా... అంతిమంగా వాటిని పరిష్కరించాల్సింది ఉద్యోగులే. అందుకే పనివేళలు పాటించాల్సిందే’’ అని స్పష్టంచేశారు. సమయానికి కార్యాలయానికి వచ్చిన వారిని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని