DSC: జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలను జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

Updated : 29 Jun 2024 09:54 IST

సబ్జెక్టుల వారీగా తేదీల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలను జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సబ్జెక్టులు, పోస్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన విడుదల చేశారు. గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదల సందర్భంగా జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించగా.. తాజాగా ఆ తేదీలు కొద్దిగా మారాయి. మొత్తం 13 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. జులై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో ఎటువంటి పరీక్షలు ఉండవు. జులై 18న స్కూల్‌ అసిస్టెంట్‌ సాంఘికశాస్త్రం, భౌతికశాస్త్రం, పీఈటీతో మొదలై.. ఆగస్టు 5న లాంగ్వేజ్‌ పండిట్‌(హిందీ)తో పరీక్షలు ముగుస్తాయి. ఆన్‌లైన్‌ పరీక్షలు కావడంతో రోజూ ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. మాధ్యమం, ఏ రోజు ఏ జిల్లాల వారికి పరీక్ష అనే వివరాలను షెడ్యూల్‌లో పొందుపరిచారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 2.79 లక్షల దరఖాస్తులు అందాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని