TG News: సీఎంఆర్‌ఎఫ్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం

సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. పారదర్శకంగా సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను వినియోగించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Published : 03 Jul 2024 02:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. పారదర్శకంగా సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను వినియోగించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను రూపొందించారు. సచివాలయంలో మంగళవారం సాయంత్రం సీఎం ఆ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈనెల 15 తర్వాత నుంచి ఈ వెబ్‌సైట్‌ https//cmrf.telangana.gov.in\ ద్వారానే దరఖాస్తులను స్వీకరించనున్నారు.  ఇకనుంచి దరఖాస్తులను ఈ వెబ్‌సైట్‌లోనే అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సహాయనిధి కోసం తమ వద్దకు వచ్చే దరఖాస్తుదారుల వివరాలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ సిఫారసు లేఖలను జత చేసి అప్‌లోడ్‌ చేస్తారు. దరఖాస్తులో లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నంబరును తప్పనిసరిగా నమోదు చేయాలి. దరఖాస్తును అప్‌లోడ్‌ చేసిన అనంతరం కోడ్‌నంబరును కేటాయిస్తారు. దాని ఆధారంగా ఒరిజినల్‌ బిల్లును సచివాలయంలో అందజేయాలి. సదరు దరఖాస్తును ఆన్‌లైన్‌లో సంబంధిత ఆసుపత్రికి పంపించి నిర్ధారణ చేసుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే దరఖాస్తును ఆమోదించి చెక్కును సిద్ధం చేస్తారు. చెక్కుపైన లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా నంబరును ముద్రిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందజేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని