NMDC: ఎన్‌ఎండీసీ సీఎండీ పోస్టుకు శ్రీధర్‌ పేరును తిరస్కరించిన కేంద్రం

జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) సీఎండీ పోస్టులో తెలంగాణ ఐఏఎస్‌ అధికారి నడిమట్ల శ్రీధర్‌ను నియమించేందుకు కేంద్ర క్యాబినెట్‌ కమిటీ తిరస్కరించిందని అధికారవర్గాలు తెలిపాయి.

Published : 03 Jul 2024 02:36 IST

సింగరేణిలో అవినీతిపై ఫిర్యాదులే కారణం!

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) సీఎండీ పోస్టులో తెలంగాణ ఐఏఎస్‌ అధికారి నడిమట్ల శ్రీధర్‌ను నియమించేందుకు కేంద్ర క్యాబినెట్‌ కమిటీ తిరస్కరించిందని అధికారవర్గాలు తెలిపాయి. గతేడాది మార్చిలో సింగరేణి సీఎండీగా ఉన్న శ్రీధర్‌ను ఎన్‌ఎండీసీ సీఎండీగా నియమించేందుకు.. పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (పీఈఎస్‌బీ) కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే కేంద్ర మంత్రివర్గ కమిటీ దీనిపై అప్పట్లో నిర్ణయం తీసుకోలేదు. తాజాగా జూన్‌ 30న జరిగిన సమావేశంలో శ్రీధర్‌ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గ కమిటీ రద్దు చేసింది. మళ్లీ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. గతంలో సింగరేణి సీఎండీగా పనిచేసిన సమయంలో శ్రీధర్‌ అవినీతికి పాల్పడినట్లు కేంద్రానికి అందిన ఫిర్యాదులే ఈ తిరస్కరణకు కారణమని సమాచారం. ఆయన పనితీరుపై అప్పట్లోనే కేంద్ర బొగ్గు శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని