Basara: బాసర ఆలయ ప్రసాదాల్లో చేతివాటం

బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని తయారీ కేంద్రం వద్ద రిజిస్టర్‌లో తక్కువ సంఖ్యలో ప్రసాదాలను నమోదు చేసి కౌంటర్‌లో ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తూ వచ్చిన డబ్బును కాజేస్తున్న సిబ్బందిపై వేటు పడింది.

Published : 29 Jun 2024 05:38 IST

ఆరుగురు సిబ్బందిపై వేటు

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని తయారీ కేంద్రం వద్ద రిజిస్టర్‌లో తక్కువ సంఖ్యలో ప్రసాదాలను నమోదు చేసి కౌంటర్‌లో ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తూ వచ్చిన డబ్బును కాజేస్తున్న సిబ్బందిపై వేటు పడింది. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ తతంగాన్ని గమనించిన స్థానికులు శుక్రవారం వారిని పట్టుకుని ఆలయ ఈవో విజయరామారావుకు అప్పగించారు. విషయాన్ని ఈవో దేవాదాయ శాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు బాధ్యులుగా గుర్తించిన ఆలయ పర్యవేక్షకుడు శివరాజ్, రికార్డు అసిస్టెంట్‌ లక్ష్మణ్‌ను సస్పెండ్‌ చేశారు. వీరితోపాటు నలుగురు తాత్కాలిక ఉద్యోగులను విధులను నుంచి తొలగించామని ఈవో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని