Teacher Promotions: పదోన్నతుల పండగ

రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతుల కల నెరవేరింది. ఇందుకోసం గత 20 ఏళ్లుగా ఎస్జీటీలు, భాషాపండితులు, పీఈటీలు ఎదురుచూస్తున్నారు.

Updated : 28 Jun 2024 07:08 IST

18,942 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్‌లు ఇచ్చిన సర్కారు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతుల కల నెరవేరింది. ఇందుకోసం గత 20 ఏళ్లుగా ఎస్జీటీలు, భాషాపండితులు, పీఈటీలు ఎదురుచూస్తున్నారు. ఈ ప్రక్రియకు అడ్డుగా మారిన చట్టపరమైన వివాదాలను సీఎం రేవంత్‌రెడ్డి పరిష్కరించడంతో 18,942 మందికి మేలు జరిగింది. విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉండడంతో దీనిపై ప్రత్యేక దృష్టిసారించారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు మార్గం సుగమం అయింది. వివాదాలకు తావులేకుండా పెద్ద సంఖ్యలో మల్టీజోన్‌ 1, 2 పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మేలు జరిగింది. పదోన్నతుల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో పారదర్శకతతో పూర్తిచేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

పదోన్నతులు ఇలా...

మల్టీజోన్‌-1 (ప్రభుత్వ, స్థానిక సంస్థలు)

  • ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ - 10,083
  • స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి   ప్రధానోపాధ్యాయులు - 1,094

మల్టీజోన్‌-2

  • ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ - 6,989
  • స్కూల్‌ అసిస్టెంట్‌  నుంచి ప్రధానోపాధ్యాయులు - 776
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని