electric motor: విద్యుత్తు మోటారు ఎలా తిరుగుతుంది?

విద్యుత్తుతో పనిచేసే ఫ్యాన్లు, మిక్సీల వంటి వాటిని రోజూ వాడుతూనే ఉంటాం. వీటిల్లోని మోటార్లు ఎలా పనిచేస్తాయో తెలుసా? ఈ మోటార్లు విద్యుత్తును చలనశక్తిగా మారుస్తాయి.

Updated : 19 Jun 2024 00:16 IST

విద్యుత్తుతో పనిచేసే ఫ్యాన్లు, మిక్సీల వంటి వాటిని రోజూ వాడుతూనే ఉంటాం. వీటిల్లోని మోటార్లు ఎలా పనిచేస్తాయో తెలుసా? ఈ మోటార్లు విద్యుత్తును చలనశక్తిగా మారుస్తాయి. ఎలక్ట్రాన్లు బలహీన విద్యుత్తు గుణాలు కలిగుంటాయి. సాధారణంగా ఇవి ఒకదాన్ని మరోటి కొట్టేసు కుంటాయి. అయితే విద్యుత్తు ప్రవాహం లోహపు తీగలో జత కలవని ఎలక్ట్రాన్లను ఒక వరుసలో ఉండేలా చేస్తుంది. దీంతో సమగ్రమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇదీ బలహీనంగానే ఉంటుంది. కానీ తీగ చుట్టలుగా చుట్టుకొని ఉండటం (కాయిల్‌) వల్ల దాని బలం పెరుగుతుంది. విద్యుదయస్కాంతమంటే ఇదే. ఎలక్ట్రిక్‌ మోటారు లోపల కాయిల్‌ చుట్టూ రెండు శాశ్వత అయస్కాంతాలుంటాయి. పరికరం మీట వేయగానే తీగ గుండా ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. అప్పుడది విద్యుదయస్కాంతంగా మారుతుంది. దీని చుట్టూ ఉండే అయస్కాంతాల ఆకర్షణ, వికర్షణ బలాలు విద్యుదయస్కాంతాన్ని భ్రమించేలా చేస్తాయి. ఈ వృత్త చలనశక్తి మూలంగానే మోటార్లు పనిచేస్తాయి. విద్యుత్తు కార్లు, స్కూటర్ల వంటి వాహనాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని