సైబర్‌ ఘోరం!

డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు.. ఇలా అన్ని పరికరాలతో అంతర్జాలాన్ని రోజూ వాడుకుంటూనే ఉంటాం. దీని వాడకం పెరుగుతున్నకొద్దీ సైబర్‌ దాడుల సంఖ్యా ఎక్కువవుతూ వస్తోంది.

Published : 26 Jun 2024 00:27 IST

డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు.. ఇలా అన్ని పరికరాలతో అంతర్జాలాన్ని రోజూ వాడుకుంటూనే ఉంటాం. దీని వాడకం పెరుగుతున్నకొద్దీ సైబర్‌ దాడుల సంఖ్యా ఎక్కువవుతూ వస్తోంది. కానీ మనం సైబర్‌ భద్రత సమాచారంపై అంతగా దృష్టి పెట్టం. అదేదో మనకు సంబంధించింది కాదని భావిస్తుంటాం. నిజానికి సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన అంకెలను పరిశీలిస్తే గుండె గుభేలు మనక తప్పదు. మచ్చుకు కొన్ని వివరాలు ఇవిగో.. 

  • వచ్చే సంవత్సరం నుంచి మీరు 69% వరకూ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశముంది.
  • ప్రతి 39 సెకన్లకు ఒకరు హ్యాకింగ్‌ బారినపడుతున్నారు.
  • ప్రతి 40 సెకన్లకు ఒక వ్యాపార సంస్థ ర్యాన్‌సమ్‌వేర్‌ దాడికి (కంప్యూటర్లను కట్టడి చేసి బలవంతంగా డబ్బులు వసూలు చేయటం) బలవుతోంది. 
  • ప్రపంచవ్యాప్తంగా వివిధ సైబర్‌ దాడులతో ఒక్కొక్కరు ఆరు నెలల్లో సగటున ఎంతెంత డబ్బును కోల్పోతున్నారో తెలుసా? మాల్వేర్‌ దాడులను ఫిక్స్‌ చేయటానికి సుమారు రూ.10,300 ఖర్చు చేస్తున్నారు. సైబర్‌ నేరం మూలంగా రూ.37,000 కోల్పోతున్నారు. ర్యాన్‌సమ్‌ దాడుల నుంచి బయటపడటానికి రూ.23,000 చెల్లిస్తున్నారు. 
  • ప్రతిరోజూ కొత్తగా 2.5 లక్షల కొత్త వైరస్‌లు ముప్పును తెచ్చిపెడుతున్నాయి.
  • సామాజిక మాధ్యమాలను వాడేవారిలో దాదాపు 50% మంది గత సంవత్సరం పాస్‌వర్డ్‌లను మార్చుకోలేదు. ఇక 20% మంది అయితే అసలు ఎన్నడూ తమ పాస్‌వర్డ్‌ను మార్చలేదు.
  • మొత్తం సైబర్‌ దాడుల్లో 80% రష్యా, చైనా, ఉత్తర కొరియా నుంచే పుట్టుకొస్తున్నాయి.
  • ముఖ్యమైన డేటాను తరచూ బ్యాకప్‌ చేసుకోవటాన్ని చిన్న వ్యాపార సంస్థలు పెద్దగా పట్టించుకోవటం లేదు. కేవలం 33% సంస్థలే బ్యాకప్‌ చేసుకుంటున్నాయి. 
  •  వైద్యరంగంలో 75% సంస్థల వ్యవస్థలు మాల్వేర్‌తో కూడుకొని ఉన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని