అనుచిత యాడ్స్‌ క్లిక్‌ చేయొద్దు!

కస్టమర్‌ సర్వీస్‌ నంబర్లు, ఆసుపత్రులు, సాఫ్ట్‌వేర్స్, యాప్స్‌.. ఇలా ఎన్నో అవసరపడుతుంటాయి. గూగుల్‌ సెర్చ్‌లో వీటి కోసం తరచూ వెతుకుతూనే ఉంటాం. మనమే కాదు.. సైబర్‌ నేరగాళ్లు, హ్యాకర్లు కూడా ఇదే పనిలో ఉంటారు.

Published : 12 Jun 2024 00:56 IST

స్టమర్‌ సర్వీస్‌ నంబర్లు, ఆసుపత్రులు, సాఫ్ట్‌వేర్స్, యాప్స్‌.. ఇలా ఎన్నో అవసరపడుతుంటాయి. గూగుల్‌ సెర్చ్‌లో వీటి కోసం తరచూ వెతుకుతూనే ఉంటాం. మనమే కాదు.. సైబర్‌ నేరగాళ్లు, హ్యాకర్లు కూడా ఇదే పనిలో ఉంటారు. కృత్రిమ మేధ సాయంతో వెతుకుతూ నిరంతరం వల వేయాలని చూస్తుంటారు. గూగుల్‌ సెర్చ్‌ చూపించిన వెబ్‌సైట్లను మనం యథాలాపంగా క్లిక్‌ చేస్తుంటాం గానీ సైబర్‌ నేరగాళ్లు వీటిని పసిగడుతూనే ఉంటారు. ప్రకటనల మీద క్లిక్‌ చేసి ఎవరెవరు ఏమేం కొంటున్నారని గూగుల్‌ దృష్టి పెట్టకపోయినా సైబర్‌ నేరగాళ్లు వీటి వెనకాల హానికర మాల్వేర్లను దాచి పెట్టి ఉంచొచ్చు. ఇలాంటి ప్రకటనలను సెర్చ్‌ ఫలితాల్లో అన్నింటికన్నా పైన కనిపించేలా చేయటంలో వీరు సిద్ధహస్తులు. వీటిని క్లిక్‌ చేయగానే పరికరంలోకి మాల్వేర్‌ చొరపడుతుంది. ఎక్కువ ప్రకటనలతో, గజిబిజిగా ఉండే ఏ వెబ్‌సైట్‌ అయినా సురక్షితం కాదు. కాబట్టి జాగ్రత్త అవసరం. 

సెర్చింగ్‌లో అప్రమత్తం

  • గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నప్పుడు ప్రాయోజిత లింకులు, ప్రకటనల మీద క్లిక్‌ చేయొద్దు.
  • బ్రౌజర్‌లో నేరుగా మొత్తం వెబ్‌సైట్‌ చిరునామాను టైప్‌ చేయాలి. దీంతో అధికారిక, విశ్వసనీయమైన వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
  • ఏదైనా లింకు మీద క్లిక్‌ చేయటానికి ముందు దాని మీద మౌజ్‌ను ఆడించాలి. అప్పుడు అడుగున ఎడమ వైపున వెబ్‌సైట్‌ చిరునామా కనిపిస్తుంది. అది విశ్వసనీయమైనదని తోస్తేనే క్లిక్‌ చేయాలి.
  • యూఆర్‌ఎల్‌లో వెబ్‌సైట్‌ చిరునామాలో అదనంగా ఏవైనా అక్షరాలు ఉన్నాయేమో చూడాలి. ఉదాహరణకు- అమెజాన్‌.కామ్‌ వెబ్‌సైట్‌కు బదులు అమెజాన్‌ తర్వాత ఇతర అక్షరాలుంటే బురిడి కొట్టించే ప్రయత్నమేనని గుర్తించాలి. 

బ్రౌజర్‌ సెటింగ్స్‌తోనూ అప్రమత్తం

  • క్రోమ్‌లో పాపప్‌ బ్లాకర్స్‌ను ఎనేబుల్‌ చేసుకోవచ్చు. సెటింగ్స్‌ ద్వారా ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీస్‌ విభాగంలోకి వెళ్లి సైట్‌ సెటింగ్స్‌ మీద క్లిక్‌ చేయాలి. ఇందులో పాపప్స్‌ అండ్‌ రీడైరెక్ట్స్‌ ఆప్షన్‌లో డోంట్‌ అలోను ఎంచుకోవాలి.
  • సేఫ్‌ బ్రౌజింగ్‌ను ఎనేబుల్‌ చేసుకోవటమూ ముఖ్యమే. సెటింగ్స్‌లోని ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ విభాగంలో సెక్యూరిటీ ద్వారా ఎన్‌హాన్స్డ్‌ ప్రొటెక్షన్‌ను ఎంచుకోవాలి.
  • ఫ్లాష్‌ డిసేబుల్‌ చేసుకోవాలి. సైట్‌ సెటింగ్స్‌లోనే జావాస్క్రిప్ట్‌ ఆప్షన్‌ ఉంటుంది. ఇందులో డోంట్‌ అలో సైట్స్‌ టు యూజ్‌ జావాస్క్రిప్ట్‌ను సెట్‌ చేసుకోవాలి.

సఫారీలోనైతే..

  • సెటింగ్స్‌ మీద క్లిక్‌ చేస్తే ఒక బాక్స్‌ పాపప్‌ అవుతుంది. ఇందులో వెబ్‌సైట్స్‌ ద్వారా పాపప్‌ విండోస్‌లో బ్లాక్‌ అండ్‌ నోటిఫైని సెట్‌ చేసుకోవాలి. దీంతో పాపప్‌ బ్లాకర్స్‌ ఎనేబుల్‌ అవుతుంది.
  • మోసపూరిత వెబ్‌సైట్ల గురించి హెచ్చరించే ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవచ్చు. సెటింగ్స్‌లోని సెక్యూరిటీ ద్వారా వెళ్లి వార్న్‌ వెన్‌ విసిటింగ్‌ ఎ ఫ్రాడ్యులెంట్‌ వెబ్‌సైట్‌ బాక్సులో టిక్‌ పెట్టుకోవాలి.
  • జావాను డిసేబుల్‌ చేసుకోవాలంటే సెటింగ్స్‌ ద్వారా సెక్యూరిటీలోకి వెళ్లి ఎనేబుల్‌ జావాస్క్రిప్ట్‌ బాక్సును అన్‌చెక్‌ చేసుకోవాలి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని