ప్రొఫైల్‌ గోప్యంగా..

సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్‌ను భద్రంగా కాపాడుకోవటం చాలా చాలా ముఖ్యం. క్రీడాకారులు, సినీ నటులు, నాయకుల వంటి ఆదరణ పొందిన, ప్రజలతో సంబంధం గలవారంటే ఏమో అనుకోవచ్చు.

Updated : 12 Jun 2024 00:30 IST

సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్‌ను భద్రంగా కాపాడుకోవటం చాలా చాలా ముఖ్యం. క్రీడాకారులు, సినీ నటులు, నాయకుల వంటి ఆదరణ పొందిన, ప్రజలతో సంబంధం గలవారంటే ఏమో అనుకోవచ్చు. కానీ మనకు సంబంధించిన అన్ని వివరాలు అందరికీ తెలియాల్సిన, అన్ని ఫొటోలను అంతా చూడాల్సిన అవసరం లేదు. మోసగాళ్లు వీటిని అనుచిత చర్యలకు వాడుకునే ప్రమాదముంది. కాబట్టి ఎవరెవరు మన ప్రొఫైల్, ఫొటోలు చూడొచ్చో సెట్‌ చేసుకోవాలి. ఇందుకు ఆయా మాధ్యమాలు అవకాశమూ కల్పిస్తాయి. ఉదాహరణకు- ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ పిక్‌ మీద క్లిక్‌ చేసి సెటింగ్స్‌ అండ్‌ ప్రైవసీలోకి వెళ్లాలి. అనంతరం సెటింగ్స్‌ మీద క్లిక్‌ చేసి ఆడియెన్స్‌ అండ్‌ విజిబిలిటీ కింద అవసరమైన ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇలాంటి సదుపాయం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని