వాట్సప్‌ కొత్త ఫీచర్లు

వాట్సప్‌ పలు కొత్త ఫీచర్లను ప్రవేశ పెట్టటం మీద దృష్టి సారించింది. మీడియా అప్‌లోడ్‌ క్వాలిటీ, కమ్యూనిటీ గ్రూపుల కోసం ఈవెంట్‌ రిమైండర్స్, ఏఐ ఆధారిత ఇమేజెస్, ఛానల్‌ ఫార్వర్డింగ్‌ వంటివి వీటిల్లో ఉన్నాయి

Published : 05 Jun 2024 00:16 IST

వాట్సప్‌ పలు కొత్త ఫీచర్లను ప్రవేశ పెట్టటం మీద దృష్టి సారించింది. మీడియా అప్‌లోడ్‌ క్వాలిటీ, కమ్యూనిటీ గ్రూపుల కోసం ఈవెంట్‌ రిమైండర్స్, ఏఐ ఆధారిత ఇమేజెస్, ఛానల్‌ ఫార్వర్డింగ్‌ వంటివి వీటిల్లో ఉన్నాయి. ఫోన్‌లోని ఫొటోలు, వీడియోల క్వాలిటీని డిఫాల్ట్‌గా సెట్‌ చేసుకోవటానికి మీడియా అప్‌లోడ్‌ ఫీచర్‌ తోడ్పడుతుంది. ముందుగా దీన్ని ఐఓస్‌ పరికరాలకు వర్తింపజేయనున్నారు. తర్వాత మిగతా ఫోన్లకు విస్తరించనున్నారు. అడ్మిన్లు తమ గ్రూపు సభ్యులకు నిర్ణీత కార్యక్రమాలు, వేడుకల గురించి అప్రమత్తం చేయటానికి ఈవెంట్‌ రిమైండర్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఇక మెటా ఏఐ సాయంతో పనిచేసే ఏఐ ఆధారిత ఇమేజెస్‌ ద్వారా చిటికెలో కోరుకున్న ఇమేజ్‌ను సృష్టించుకోవచ్చు. ఇక ఛానెల్‌ ఫార్వర్డింగ్‌ ద్వారా యజమానులు తమ వ్యక్తిగత ఛాట్‌ నుంచి మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, గిఫ్స్‌ను తమ ఛానెల్స్‌కు ఫార్వర్డ్‌ చేయటం సాధ్యమవుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని