నోటి మాటతోనే ఎమోజీ జత

నోటి మాటను రాత రూపంలోకి మార్చే ప్రక్రియ (వాయిస్‌ డిక్టేషన్‌) ఇటీవల బాగా అభివృద్ధి చెందింది. కానీ ఈ ఫీచర్‌ వాడకం పరిమతమే. ముఖ్యంగా కొన్ని యాసలు అర్థం చేసుకోవటంలో టూల్స్‌ ఇబ్బంది పడుతుంటాయి.

Published : 05 Jun 2024 00:02 IST

నోటి మాటను రాత రూపంలోకి మార్చే ప్రక్రియ (వాయిస్‌ డిక్టేషన్‌) ఇటీవల బాగా అభివృద్ధి చెందింది. కానీ ఈ ఫీచర్‌ వాడకం పరిమతమే. ముఖ్యంగా కొన్ని యాసలు అర్థం చేసుకోవటంలో టూల్స్‌ ఇబ్బంది పడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెక్స్ట్‌ మెసేజ్‌లో మాటలతో ఎమోజీలను జతచేయటం బాగా ఉపయోగ పడుతుంది. వాయిస్‌-టు-టెక్స్ట్‌ ఫీచర్‌ చాలావరకూ ఎమోజీలను టెక్స్ట్‌ రూపంలో పంపుతుంటాయి. దీనికి కారణం మన ఆలోచనలకు తగిన భావోద్వేగానికి తగిన ఎమోజీల పేరు తెలియకపోవటం. ఎమోజీపీడియా ద్వారా ప్రాచుర్యం పొందిన ఎమోజీల పేర్లను తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. అనంతరం ఎంచక్కా సరైన ఎమోజీలను నోటి మాటతోనే జత చేసుకోవచ్చు. ఇంతకీ ఇదెలా చేయాలంటే?

ఐఫోన్‌లో..

  •  టైప్‌ చేయాలనుకునే లేదా సందేశాన్ని పంపాలనుకునే యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
  •  టైప్‌ చేయనున్న టెక్స్ట్‌ బాక్సులోకి వెళ్లి, కీబోర్డు మీద మైక్రోఫోన్‌ గుర్తు మీద తాకాలి. డిక్టేషన్‌ సదుపాయాన్ని ఎనేబుల్‌ చేసుకోవాలి.
  •  తర్వాత పంపాలనుకునే మెసేజ్‌ను మాటతో చెప్పాలి. ఎమోజీ పదాన్ని పలికిన తర్వాత దాని పేరును పలకాలి. 
  •  అయితే పాత ఐఓఎస్‌ వర్షన్‌ పరికరాల్లో ఈ ఫీచర్‌ పనిచేయకపోవచ్చు.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో..

  •  టైప్‌ చేయాలనుకునే యాప్‌ను ఓపెన్‌ చేయాలి. 
  • కీబోర్డు మీద మైక్రోఫోన్‌ గుర్తును తాకాలి.
  • మెసేజ్‌ను డిక్టేట్‌ చేసి, జత చేయాలనుకునే ఎమోజీ పేరును చెప్పాలి. 

ఉదాహరణకు- మీరు ‘ఓకే సీ యూ ఎట్‌ నైట్‌’ అనే సందేశానికి గుండె గుర్తును జతచేయాలని అనుకున్నారనుకోండి. ‘ఓకే సీ యూ ఎట్‌ నైట్‌ రెడ్‌ హార్ట్‌ ఎమోజీ’ అని చెబితే సందేశం పక్కన గుండె ఎమోజీ వచ్చి చేరుతుంది. ఒకవేళ గూగుల్‌ వాయిస్‌-టు-టెక్స్ట్‌ ఫీచర్‌ మనమేం మాట్లాడుతున్నామో అర్థం చేసుకోలేకపోతుంటే గేర్‌ గుర్తు మీద తాకి, లాంగ్వేజెస్‌ ఎంచుకోవాలి. ఇందులో భాష, యాసను నిర్ణయించుకోవాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని