వావ్‌.. జీపీటీ-4ఓ!

ఓపెన్‌ ఏఐ సంస్థ ఇటీవల అధునాతన లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌(ఎల్‌ఎల్‌ఎం)ను పరిచయం చేసింది. దీని పేరు జీపీటీ-4ఓ. ఛాట్‌జీపీటి ద్వారా దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. జీపీటీ-4 కన్నా ఎక్కువ సామర్థ్యాలు గల దీనిలోని కొన్ని ఫీచర్లేంటో చూద్దాం.

Published : 29 May 2024 00:06 IST

అభివృద్ధి దశలోనే జీపీటీ-4ఓ అబ్బురపరుస్తోంది. మున్ముందు మరింత మెరుగై ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

ఓపెన్‌ ఏఐ సంస్థ ఇటీవల అధునాతన లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌(ఎల్‌ఎల్‌ఎం)ను పరిచయం చేసింది. దీని పేరు జీపీటీ-4ఓ. ఛాట్‌జీపీటి ద్వారా దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. జీపీటీ-4 కన్నా ఎక్కువ సామర్థ్యాలు గల దీనిలోని కొన్ని ఫీచర్లేంటో చూద్దాం.

  • ఫేషియల్‌ రికగ్నిషన్‌: అప్‌లోడ్‌ చేసిన ఫొటోలలో ఉన్న మనుషుల ముఖాలను విశ్లేషించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఆయా ఫొటోలకు సంబంధించి ప్రశ్నలను అడిగినా జవాబులు ఇవ్వగలదు.
  • చేతిరాత విశ్లేషణ: చేత్తో రాసిన డాక్యుమెంట్ల ఇమేజ్‌లను అప్‌లోడ్‌ చేసినా వాటిని విశ్లేషిస్తుంది. తేలికగా అర్థం చేసుకోవటానికి తోడ్పడుతుంది.
  • ఇమేజ్‌ వివరణ: ఎలాంటి ఇమేజ్‌లను అప్‌లోడ్‌ చేసినా జీపీటీ-4ఓ వాటిని వివరించగలదు.
  • ఆహార సలహా: తినే భోజనానికి సంబంధించిన ఫొటోలను దీనికి షేర్‌ చేస్తే కేలరీల మోతాదును అంచనా వేయగలదు. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకునేవారికిది ఎంతో అనువు.
  • లొకేషన్‌ గుర్తింపు: తెలియని చోట్లకు సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్‌ చేశారనుకోండి. అవి ఏ ప్రాంతానికి చెందినవో కచ్చితంగా గుర్తిస్తుంది.
  • అనువాద సహాయం: ఇమేజెస్‌లో ఎలాంటి భాషలనైనా తక్షణం అనువాదం చేయగలదు. భాష తెలియని చోట్ల ప్రయాణాలు చేసేవారికిది ఉపయుక్తం.
  • సంస్కృతి అవగాహన: ఆయా సంస్కృతులకు చెందిన ఫొటోలను కూడా జీపీటీ-4ఓ విశ్లేషిస్తుంది. విద్యార్థులకిది చేదోడుగా నిలుస్తుంది.
  • వీడియో విశ్లేషణ: ఇది ప్రత్యక్ష వీడియోలనూ విశ్లేషించగలదనీ ఓపెన్‌ ఏఐ ప్రదర్శించింది. అయితే ఈ ఫీచర్‌ను ఇంకా విడుదల చేయలేదు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని