ఆ నంబర్లకూ వాట్సప్‌ మెసేజ్‌

వాట్సప్‌లో మన ఫోన్‌లో సేవ్‌ అయిన కాంటాక్టులకే మెసేజ్‌లు, ఫొటోలు, డాక్యుమెంట్ల వంటివి పంపటానికి వీలుంటుంది.

Published : 15 May 2024 00:16 IST

వాట్సప్‌లో మన ఫోన్‌లో సేవ్‌ అయిన కాంటాక్టులకే మెసేజ్‌లు, ఫొటోలు, డాక్యుమెంట్ల వంటివి పంపటానికి వీలుంటుంది. అయితే కొన్నిసార్లు కాంటాక్టు జాబితాలో లేనివారికీ సందేశాలు పంపాల్సి రావొచ్చు. మరెలా? దీనికి మార్గం లేకపోలేదు.

  • వాట్సప్‌ను ఓపెన్‌ చేసి సెర్చ్‌ బాక్సులో ‘యు’ టైప్‌ చేయాలి.
  • అది మన నంబరే కావటం వల్ల మనకు మనమే సందేశాలు పంపుకోవచ్చు. ఇందులో సేవ్‌ చేయొద్దని భావించే ఫోన్‌ నంబర్‌ను టైప్‌ లేదా పేస్ట్‌ చేసి సెండ్‌ చేయాలి.
  • అప్పుడు మన ఛాట్‌లో ఆ నంబరు నీలం రంగులోకి మారుతుంది. దాని మీద తాకితే ఛాట్‌ విత్‌, కాల్‌ ఆన్‌ వాట్సప్‌, యాడ్‌ టు కాంటాక్ట్స్‌ ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ఛాట్‌ విత్‌ను ఎంచుకొని మెసేజ్‌లు పంపించొచ్చు.

గ్రూపులో ఉన్నప్పుడు..

గ్రూపు సభ్యుల్లో అందరి నంబర్లనూ సేవ్‌ చేసుకోవటం సాధ్యం కాకపోవచ్చు. మరి వారికి మెసేజ్‌లు పంపాలంటే?

  • వాట్సప్‌ గ్రూప్‌ను ఓపెన్‌ చేసి, గ్రూపు ఇన్ఫోమీద తాకాలి.
  • గ్రూపులోని సభ్యుల జాబితాలో మెసేజ్‌ పంపాలనుకునేవారి నంబరు మీద తాకాలి. పాపప్‌ అయ్యే ఆప్షన్లలోంచి మెసేజ్‌ను ఎంచుకుంటే వారి ఛాట్‌ విండో ఓపెన్‌ అవుతుంది. ఫోన్‌ నంబరు సేవ్‌ చేసుకోకుండానే ఆ ఛాట్‌ విండో నుంచి నేరుగా సందేశాలు పంపొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని