ఫైళ్ల అంశాలు ప్రివ్యూలో

డెస్క్‌టాపో, ల్యాప్‌టాపో.. ఏదైనా పీసీలో బోలెడన్ని ఫైళ్లు. రోజూ కొత్తవి ఎన్నో వచ్చి చేరుతుంటాయి. కొన్నిసార్లు పేర్లనూ మరచిపోతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని వెతికి పట్టుకోవటమంటే మాటలు కాదు.

Published : 29 May 2024 00:06 IST

డెస్క్‌టాపో, ల్యాప్‌టాపో.. ఏదైనా పీసీలో బోలెడన్ని ఫైళ్లు. రోజూ కొత్తవి ఎన్నో వచ్చి చేరుతుంటాయి. కొన్నిసార్లు పేర్లనూ మరచిపోతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని వెతికి పట్టుకోవటమంటే మాటలు కాదు. అయితే మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో కూడిన విండోస్‌ 7, 10, 11 పరికరాలు వాడేవారికిది తేలికైన పనే. ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌లో బిల్టిన్‌గా ఉండే ప్రివ్యూ పేన్‌ ఫీచర్‌ ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. ఇది టెక్స్ట్‌ ఫైళ్లు, ఇమేజెస్, షీట్స్‌ వంటి వాటికి సంబంధించిన అంశాలను ప్రివ్యూలో చూపిస్తుంది. ఫైళ్లను ఓపెన్‌ చేయకుండానే వాటిలోని అంశాలను తెలుసుకోవచ్చు. దీంతో చాలా సమయం ఆదా అవుతుంది. ప్రివ్యూ పేన్‌ ఫీచర్‌ డిఫాల్ట్‌గా అదృశ్యంగా ఉంటుంది. అందువల్ల మాన్యువల్‌గా ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

  • ఫోల్డర్‌ను ఓపెన్‌ చేసి ఆల్ట్, పీ మీటలు రెండింటినీ కలిపి నొక్కితే ప్రివ్యూ ఫీచర్‌ ఎనేబుల్‌ అవుతుంది. ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌లోని వ్యూ విభాగం నుంచి అయినా ఎనేబుల్‌ చేసుకోవచ్చు.
  • ఒకసారి ఎనేబుల్‌ చేసుకుంటే చాలు. అనంతరం ఫైలు మీద ఒకసారి క్లిక్‌ చేస్తే సరి. అది ఓపెన్‌ కాకుండానే దానిలోని అంశాలు పక్కన కనిపిస్తాయి.
  • సపరేషన్‌ బార్‌ను జరపటం ద్వారా ప్రివ్యూ పేన్‌ను పెద్దగా లేదా చిన్నగా చేసుకోవచ్చు.
  • డాక్యుమెంట్లు, ఇమేజెస్, వీడియోల అంశాలన్నీ ఇందులో చూసుకోవచ్చు. అయితే జిప్‌ వంటి కొన్ని ఫైళ్ల అంశాలు కనిపించకపోవచ్చు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని