Sunil Gavaskar: భారత క్రికెట్‌లో వెలుగులు నింపారు.. సునీల్‌ గావస్కర్‌కు బర్త్‌డే విషెస్‌

టీమ్‌ఇండియా క్రికెట్‌ భారీగా విస్తరించడంలో అతడి పాత్ర అత్యంత కీలకం. విదేశీ గడ్డపై భారీ పేసర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడే రోజుల్లోనే ముందుకొచ్చిన దిగ్గజ క్రికెటర్. ఇవాళ ఆయన బర్త్‌డే.

Published : 10 Jul 2024 17:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) 75వ బర్త్‌డే. టెస్టు క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన గావస్కర్‌కు ప్రముఖ క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 10వేల మార్క్‌ను తాకిన తొలి బ్యాటర్‌గా రికార్డు నమోదు చేశాడు. బీభత్సమైన విండీస్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదురొడ్డి నిలిచిన గావస్కర్‌ బ్యాటింగ్‌ నైపుణ్యం తరతరాల క్రికెటర్లకు విలువైన పాఠాలుగా మాజీలు అభివర్ణించారు. 

‘‘హ్యాపీ బర్త్‌డే సునీల్ గావస్కర్‌జీ. మీ బ్యాటింగ్‌ నైపుణ్యం అద్భుతం. దూకుడుగా ఆడినా.. డిఫెన్సివ్‌తో ప్రత్యర్థి బౌలింగ్‌ను సులువుగా ఆడేస్తారు. మున్ముందు మరింత మంచి జరగాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ - జై షా, బీసీసీఐ కార్యదర్శి

‘‘నా బ్యాటింగ్ హీరోకి ప్రత్యేక శుభాకాంక్షలు. మిస్టర్‌ సునీల్ గావస్కర్ మీరు 75 దాటేశారు. ఇలాగే మరింతకాలం ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా. క్రీజ్‌లో ఎక్కువ సమయం గడపాలనే వారికి మీరే స్ఫూర్తి. ఇప్పటికీ కుర్రాడిగానే ఉన్నారు ’’ - సచిన్ తెందూల్కర్

‘‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్. ఐకానిక్ కామెంటేటర్. యువ క్రికెటర్లకు స్ఫూర్తి. క్రీజ్‌లో ఉంటే ఎలాంటి బెరుకు లేకుండా ఆడే నైజం. నిర్భయంగా బ్యాటింగ్‌ ఆడేయడం, క్రికెట్‌లో తనదైన మార్క్‌ను చూపించిన మా సునీల్ గావస్కర్‌కు బర్త్‌డే విషెస్. మెంటార్‌గా అతడి నుంచి విలువైన సమాచారం పొందుతూనే ఉన్నాం’’ - హర్భజన్‌ సింగ్‌

‘‘లిటిల్‌ మాస్టర్ 75వ వసంతంలోకి అడుగు పెట్టారు. భారత బ్యాటింగ్‌లో విప్లవాత్మక మార్పులకు కారణం మీరు. విష్ యూ హ్యాపీ బర్త్‌డే’’ - రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్ ఫ్రాంచైజీ

‘‘సన్నీ సర్‌. హ్యాపీ బర్త్‌డే. ఆయురారోగ్యాలతో వర్థిల్లాలి’’ - మునాఫ్ పటేల్, భారత మాజీ బౌలర్

‘‘దిగ్గజం కోసం హ్యాట్స్‌ ఆఫ్‌. భారత క్రికెట్‌కు వెలుగులు (సన్నీ డేస్‌) తీసుకొచ్చిన గావస్కర్‌కు హ్యాపీ బర్త్‌డే’’- దిల్లీ క్యాపిటల్స్‌, ఐపీఎల్ ఫ్రాంచైజీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని